Categories
పెదవులకు పగడపు రంగు రావాలంటే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అర టీ స్పూన్ వెన్నలో రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు నిద్రపోయే ముందర పెదవులకు అప్లయ్ చెయ్యాలి. బీట్ రూట్ రసం తో ప్రతి రోజూ నిద్రకు ముందు పెదవులకు రాసి మర్దన చేస్తే పెదవులు కాంతివంతంగా మారతాయి. టమాటో జ్యూస్ కొబ్బరి నూనెల మిశ్రమంలో అయినా ఇదే ఫలితం ఉంటుంది. నిమ్మరసంలో తేనె రెండు చుక్కల గ్లిజరిన్ కలిపి ప్రతి రోజూ పెదవులకు అప్లయ్ చేస్తే పెదవులు పగడపు కాంతులతో మెరుస్తాయి .