తెలుగు వారి పండుగలు పర్వదినాలలో బెల్లంతో చేసిన పదార్థాలు ఉండవలసిందే సంక్రాంతికి బెల్లపు అరిసెలు, కొత్త పంట రాగానే తొలి నివేదన చేసే పొంగలి,శ్రీరామనవమికి బెల్లపు పానకం, గణపతి నవరాత్రుల్లో పానకం, పాయసం,వరంగల్ జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మకు సమర్పించే బంగారం బెల్లమే . బెల్లం వినియోగం భారతీయుల జీవనశైలిలో భాగం వంటలో చిరుతిళ్ళు నైవేద్యాలు ఆరోగ్యల్లో బెల్లానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రకృతి సహజంగా ఎలాంటి రసాయనాలు లేకుండా తయారయ్యే బెల్లంలో ఎన్నో విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చూస్తే తీయదనం కోసం వాడే పంచదార కంటే బెల్లంలో అధిక పోషకాలున్నాయి. ఇది మేలైన డిటాక్సిన్ బెల్లం ఆహారంతో పాటు తీసుకొంటే బరువు తగ్గే ప్రయత్నాలు సులభంగా అవుతాయి. ఆహారం జీర్ణం కావడానికి సహాయపడే ఎంజైమ్స్ బెల్లం ప్రేరేపిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చెఫ్ లు బెల్లంతో తయారు చేసే డిజర్ట్ లకు ప్రాధాన్యత ఇస్తారు .లిక్విడ్ గోల్డ్ గా పిలిచే బెల్లం ఎలాంటి రసాయనాలు లేని తీపి పదార్థం అంటారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో బెల్లాన్ని వినియోగిస్తారు. గ్లెకామిక్ ఇండెక్స్ ప్రకారం కూడా పంచదారకన్న బెల్లమే మంచిది. ఎలాంటి రసాయనాలు కలపని బెల్లం ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది. స్పటికల్లాగా మెరుస్తూ పచ్చగా ఉంటే బెల్లం తయారీలో రసాయనాలు వినియోగించారని అర్థం .నిత్యజీవితంలో బెల్లం వినియోగం పెంచి ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు పరిశోధకులు.
Categories