Categories
ఉత్తర ప్రదేశ్ లోని మంద్రలో ఉన్న మధురకు వెళ్ళి శ్రీ కృష్ణుని దర్శనం చేసుకుని వద్దాం పదండి.హోలీ కూడా ఆడాలి కదా!!
మధురలో మనకు చిన్ని కృష్ణుని కొంటె పనులు,గోపికలతో రాసలీలలు, కంస మామను సంహరించిన ప్రదేశం,గోవర్ధనగిరి పర్వతం,రాధ మాధవ శృంగార సంకీర్తనలు మొదలగునవి ఇక్కడ స్పష్టంగ చూడవచ్చు.భక్తులు దర్శనార్ధం వేకువజామునే వస్తారు.సాయంత్రం ఎవ్వరినీ ఆలయ ప్రాంగణంలో ఉండనివ్వరు కారణం అక్కడకి రాత్రి పూట శ్రీ కృష్ణ సమేత గోపికలు వచ్చి రాసక్రీడలతో మరియు రాధ మాధవుల కలయిక బృందావనంగా తిరుగాడుతారని అందుకే రాత్రి వేళ భక్తులకు నిబంధన విధించారు.మన జన్మ తరించాలీ అంటే మధురకి ప్రయాణం అవ్వాల్సిందే!!
నిత్య ప్రసాదం: కొబ్బరి,వెన్న,అటుకులు.
-తోలేటి వెంకట శిరీష