మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్, నటించిన మారా  సినిమాకు మలయాళం మూవీ చార్లీ ఆధారం పార్వతి అన్న యువతి కేరళలోని ఒక కుగ్రామంలో గోడలపైన తాను చిన్నతనంలో విన్న కథ తాలూకూ చిత్రాలను చూసింది.ఆ కథలన్నీ గోడల పైన చిత్రించిన మణి మారన్ ను  వెతుక్కొంటూ వెళ్తుంది. ఆ ప్రయాణంలో తాను విన్న కథ లోని ఒక ప్రేమికుల జంటను కలుసుకుంటుంది.అప్పటికే వాళ్ళు వృద్ధులు జీవితం మొత్తం ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెతుక్కుంటూ పెద్దవాళ్ళయిపోతారు. తనను ఆదరించిన వృద్ధికి ప్రేమ కథ లో ఉన్న ప్రియురాలిని  వెతికేందుకు మారా దేశదిమ్మరి గా తిరుగుతుంటాడు. పారు తనకు కథ చెప్పిన నర్స్ ని ఆ ముసలివాడు వెతుకుతున్న ఆమె గా గుర్తించి ఆమెను తీసుకు వస్తుంది. మణి మారన్  అభిమానం గెల్చుకొంటుంది.చాలా అందమైన ఈ ప్రేమ కథ ప్రైమ్ లో ఉంది.
రవిచంద్ర .సి  
7093440630

Leave a comment