దుర్గా ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్ గా పిలుస్తారు ఓయినం బెమ్ బెమ్ దేవిని. ఐ ఎ ఎఫ్ ఎఫ్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా రెండు సార్లు 2017 లో అర్జున్, 2020 లో పద్మశ్రీ అవార్డ్ లు ఆమెను వరించాయి. ఫుట్ బాల్ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె ఇంఫాల్ లో జన్మించిన బెమ్ బెమ్ దేవి పదేళ్ళ వయసులో ఇంఫాల్ యునైటెడ్ పయోనీర్స్ క్లబ్ లో శిక్షణ కు చేరారు. నేర్చుకోవడం మొదలు పెట్టిన మూడేళ్లకే మణిపూర్ తరఫున సబ్ జూనియర్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో అండర్ 13 విభాగానికి నేతృత్వం వహించారు. సౌత్ ఇండియన్ గేమ్స్ 2010 ,12 ఎస్. ఎ. ఎఫ్.ఎఫ్ విమెన్స్ ఛాంపియన్ షిప్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలిచారు. ఇండియన్ విమెన్స్ లీగ్ కు బాధ్యత వహించిన తొలి మహిళా మేనేజర్ ఆమె.

Leave a comment