దక్షిణ అమెరికాలో అతి గొప్ప నిర్మాణం గా బహాయి ఆలయం పేరు తెచ్చుకుంది బిలి లోని శాంటియాగో లో ఉన్న ఈ ఆలయం ఒక ప్రార్థన మందిరం. ఇందులో అన్ని మతాల వారికి ప్రవేశం ఉంటుంది. 2016 లో ప్రారంభించిన ఈ ఆలయం పాలరాయి గాజుతో తయారయింది. ఈ ఆలయాన్ని కెనడియన్ ఆర్కిటెక్ట్ Siamak Hariri రూపొందించారు. ఈ ఆలయం పొడవు 30 మీటర్లు వెడల్పు కూడా 30 మీటర్లే. తొమ్మిది రేకుల పుష్పం లాగా ఉండే ఈ ఆలయం బయట భాగం గ్లాస్ లోపల పాలరాయితో నిర్మించారు. బహాయి విశ్వాసం   అన్ని మతాల ప్రజలు ఒకే చోటు చేరాలని ఒకే ఆత్మగా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ఆరాధించాలని బోధిస్తుంది. మతపరమైన నేపథ్యం స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా ఈ ఆలయంలో ప్రవేశించి ప్రార్థనలు చేసుకోవచ్చు.

Leave a comment