ఎన్నోళ్లు గానో లేదా ఎన్నేళ్లు గానో క్రంచ్ ఇతర వ్యాయామాలు చేస్తున్న ఉదరం సమంగా లేదూ అంటే తప్పనిసరిగా ప్రయత్న లోపం ఉందనే అర్ధం. నడుం చుట్టూ వుండే కొద్ది పాటి కొవ్వు  ఆకృతిని దెబ్బతీస్తుంది. స్త్రీలకైనా పురుషులకైనా పొట్ట ప్లాట్ గా  సమంగా ఉంటేనే బావుంటుంది. నాజూకైన నడుం వల్ల  అనారోగ్య సమస్యలు రావన్న గ్యారెంటీ ఏదీ లేదు. కానీ ఫ్లాట్ అబ్స్ గలవారికి మిగతా వారితో పోల్చితే 25 శాతం తక్కువగా గుండె జబ్బుల అవకాశాలు ఉంటాయి. 35 శాతం తక్కువ హార్ట్ ఎటాక్స్ వస్తాయని 41 శాతం తక్కువగా బీ.పి వస్తుందని 40 శాతం కిడ్నీ కాన్సర్ అవకాశాలు తగ్గుతాయని గాల్ స్టోన్స్ అవకాశాలు 60 శాతం తక్కువనీ  ఆస్ట్రియో ఆర్థరైటిస్ అవకాశాలు 34 శాతం తక్కువనీ  అధ్యయనాలు చెపుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తక్కువే ఆరోగ్య అవకాశాలు ఎక్కువే కనుక ఎక్కువసేపు కూర్చునే ఉండకుండా మంచు వ్యాయామం నడక వదలకుండా ఉంటే చాలు.

Leave a comment