Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2017/11/Multani-Mitti.jpg)
చర్మాన్ని శుబ్రం చేసే శక్తి ముల్తానీ మట్టికి వుంది. రోజ్ వాటర్, గండం పొడి లో ముల్తానీ మట్టి కలిపి పేస్ట్ లా చేసి మెడపైన ఫేస్ ప్యాక్ లా వేస్తె నల్లదనం పోతుంది. ముల్తానీ మట్టి లో వుండే మినరల్స్ మొహం పై మచాల్ని తొలగించేందుకు తోడ్పడతాయి. ఇందుకోసం ముల్తానీ మట్టి, పెరుగు, పుదీనా కలిపి ఫేస్ ప్యాక్ లా వేస్తె ముఖం పై మచ్చలు పోతాయి. ఈ ప్యాక్ ప్రతి రోజు వేసుకోవాలి. ఓ అరగంట పాటు మొహం పైన ఆరనిచ్చి కడిగేస్తే కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్, క్యారెట్ గుజ్జు ముల్తాణీ మట్టి ఫేస్ ప్యాక్ కుడా ఇదే విశదంగా మచ్చలను పోగొట్టి మొహానికి మెరుపు ఇస్తుంది.