ఉదయం వంట తేలిగ్గా ఉంటుందని కొన్ని కురాల్ని రాత్రే కోసి ఫ్రిజ్ లో పెట్టేస్తూ వుంటారు. ఎక్కువసేపు కోసి ఉంచితే వీటి లోని కీలక పోషకాలు, ఖనిజాలు, ఆక్సిడేషన్ ద్వారా తగ్గి పోతాయి. వంట చేసే ముందే కోయడం చాలా మంచిది. కాలీ ఫ్లవర్, బ్రోకలీ వంటి పువ్వుల కూరగాయాలు కట్ చేసిన వెంటనే తేమ పోదు. అయితే ఇవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఫ్రిజ్ లో పెడితే ఫ్లేవర్లు పీల్చుకుంటాయి వీటి వాసన మిగితా వాటికి అంటుతుంది. కనుక కాలి ఫ్లవర్ ని కోస్న వెంటనే గట్టి మూట వున్నా బాక్స్ లో పెట్టేయాలి. బ్రోకలీని నెట్టెడ్ పోవచ్ లో పెట్టాలి. అలా అయితే గాలి బాగా తగులుతుంది. క్యాబేజీ కట్ చేసి ప్లాస్టిక్ బాక్స్ లో ఉంచాలి. బీన్స్ కట్ చేసి ఆరనివ్వాలి. ఉల్లిపాయల్ని కట్ చేసి తప్పని సరిగా గట్టి ముతా వున్న బాక్స్ లో బద్రం చేసి ఫ్రిజ్ లో వుంచి ఒక్క రోజులో వాడుకోవాలి.

Leave a comment