బ్లాక్ మిర్రర్ వెబ్ సిరీస్ మొత్తం ఐదు సీజన్లు 22 ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ సిరీస్ కధలన్నీ యునైటెడ్ కింగ్ డమ్ లో జరిగేవే కానీ సాంకేతికత తో మానవుల సంబంధాన్ని అన్వేషించే క్రమంలో ఈ కథలన్నీ విశ్వ జనీనం అవుతాయి.మన ఆధునిక సంస్కృతి అందులో టెక్నాలజీ పోషిస్తున్న పాత్ర వాటి ద్వారా ఏర్పడుతున్న వింత పోకడలను మన కళ్ళ ముందుకు తెచ్చిన ఈ సిరీస్ సృష్టికర్త చార్లీ బ్రూకర్.బ్లాక్ మిర్రర్ ఒక యంధాలజీ   సిరీస్.ఒకే రకమైన అంశాన్ని చర్చించే కథలు గడిచిన కొన్ని ఏళ్ళ లో అత్యంత వేగంగా విస్తరించిన టెక్నాలజీ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో భవిష్యత్తులో మనుష్యుల టెక్నాలజీ పైన ఎలా ఆధారపడి జీవిస్తారో ఊహీస్తూ అల్లిన కథల సంకలనం ఈ వెబ్ సిరీస్ తప్పకుండా చూడవలసిన సిరీస్ ఇవి.ఎక్కడైనా మొదలుపెట్టిన ఏ ఎపిసోడ్ అయినా చూడొచ్చు.
రవిచంద్ర.సి  
709340630
 

Leave a comment