గత పదిహేను సంవత్సరాల్లో 350 యాడ్స్  లో నటించింది మహిమ మెహతా. సెయింట్ జూనియర్ కాలేజ్ లో అడ్వర్టైజింగ్ విభాగంలో డిప్లమా చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.బిగ్ బాస్కెట్, యాక్సిస్ బ్యాంక్,బజాజ్ అలియాంజ్ ,కోల్గేట్ ,జెల్ ,టాటా స్కై ,వంటి యాడ్స్ నటించింది.షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్,ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్,సుస్మితాసేన్,ఆలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్ తో కలిసి యాడ్స్ చేయటం విశేషం.పది సెకన్ల యాడ్ లో విభిన్న పాత్రల్లో కనిపించే అవకాశం ఉంటే, ఎన్నో ఎమోషన్స్ నటించి చూపవలసిన కోపం ఉంటే ఈ యాడ్స్ ను దాటి ఇంకో కెరీర్ లోకి వెళ్లాలనిపించలేదు అంటోంది మహిమ మెహతా.

Leave a comment