కేరళ రాష్ట్రంలో ఉన్న కొట్టాయంలో వెలసిన మహాదేవుని ఆలయం దర్శనం చేసుకుని వద్దాం పదండి!!
పరశురాముడు నదీతీరాన వెల్తూ నదిలో ఒక కాంతిని చూడగానే పరిశీలనగా చూసి,అక్కడ శివలింగ రూపం కనబడింది.దానిని బయటకు తీసి ఆలయం కట్టించి పూజలు చేస్తారు.ఇక్కడ శివయ్యను ఉదయం దక్షిణామూర్తిగా,మధ్యాహ్నం కిరాతకమూర్తిగా,సాయంత్రం సచ్చితానంద మూర్తి గా దర్శనం ఇస్తాడు.కార్తీక మాసంలో వచ్చే విశిష్ట పూజలు నిర్వహిస్తారు.వీనులవిందుగా వుంటుంది.కార్తీక మాస శోభ అంటే ఇక్కడే చూడాలి.శివయ్యకు అభిషేకాలు,విభూతి తో పూజలు అంటే ఎంతో ఇష్టం.పురాణాలలో ఒక ఆలయ పూజారి కధనం ప్రకారం పూజారి స్వామి వారి సన్నిధిలో పూజలు చేస్తూ వున్నా తను చేసిన తప్పుకి వారి వంశంలో వంశోధ్ధారకుడు జన్మించలేదు.
అతి పురాతన కట్టడం వల్ల ఒకసారి అగ్నిప్రమాదం జరిగిన ఆలయ పూజారి శివలింగాన్ని ఆపద నుంచి కాపాడాడు.తన వంశానికి చెందిన వారెవ్వరూ ఇలాంటి కష్టాలు పడకూడదు అని అనుకున్నాడు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం
-తోలేటి వెంకట శిరీష