ఏ రసాయనాలు వాడకుండా ప్రతి రోజు ఓ అరగంట కేటాయించాలి ఇంట్లో వుండే వస్తువులతో,మొహం మెరిసేలా చేసుకోవచ్చు ముందుగా గుప్పేడు గులాబీ రేకుల్ని నీళ్ళలో మరిగించి అందులో కొద్దిగా టోమోటో రసం తేనె కలిపి ఆ మిశ్రమం తో మొహం శుభ్రం చేసుకుంటే టాన్ పోతుంది మరుగుతున్న నీళ్ళలో రెండు చుక్కలు లావెండర్ నూనె వేసి ముఖానికి ఆవిరి పట్టాలి . పంచదార,తేనె కలబంద గుజ్జు,గులాబీ రేకుల గుజ్జు,ఎస్సెన్షియాల్  ఆయిల్ కలిపి సవ్య అపసవ్య దిశల్లో ముఖానికి మర్దన చేయాలి టోమాటో గుజ్జులో కొబ్బరి పాలు, తేనె సెనగపిండి కలిపి మొహానికి పూతలా వేసుకొని ఆర నిచ్చి కడిగేయాలి ఈ పూత అన్ని రకాల చర్మ తత్వాలకు పనికి వస్తుంది.

Leave a comment