కర్ణాటక లోని శిరశి కి చెందిన గౌరీ నాయకి ని మహిళా భగీరథ అని పిలుస్తారు.నీళ్లు లేక ఎండిపోతున్న మొక్కల కోసం ఈమె భూమి లోతుల్లోంచి నీళ్లను పైకి తెచ్చారు. కోవిడ్ లో ఒక బావి, తరువాత పిల్లల కోసం ఇంకొక బావి, ఎప్పుడు మహాకుంభమేళా పేరుతో 40 అడుగుల లోతులో ఇంకో బావి తవ్వింది గౌరీ నాయకి. ఆమె వయసు 58. ఈ బావుల తవ్వకం వంటి చేత్తో పూర్తి చేశారామె. ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల మనుషులను పెట్టి బావి తవ్వించుకునే శక్తి లేదు ఆమెకు. అందుకే ఎన్నో కష్టాలు పడుతూ సొంతంగా బావిని తవ్వి నీటిని బయటకి తీసింది ఈ మహిళా భగీరథ గౌరీ నాయకి.

Leave a comment