పెరుగు లేదా మజ్జిగ తో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది.పులిసిన పెరుగు మజ్జిగ లో ఇది రెట్టింపుగా ఉంటుంది. ఇది పేగుల్లోని చెడు బ్యాక్టీరియాను నశింపజేసి మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది.శరీరంలోని వైరస్ లను రానివ్వదు. ఇందులో కొవ్వు క్యాలరీల శాతం కూడా తక్కువే ఇన్ని ప్రయోజనాలు ఉన్న దీనితో పులుసు పెట్టుకోవచ్చు రెండు గ్లాసుల మజ్జిగలో ఉప్పు వేసి పెట్టుకోవాలి.ఉల్లిపాయి పచ్చిమిరపకాయలు పల్చగా సన్నగా తరిగి పెట్టుకోవాలి.స్టవ్ పైన గిన్నెలో నూనె వేసి, అందులో చెంచా చొప్పున జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు పసుపు వేసి చివర్లో ఇంగువ, పసుపు, వేసి ఈ పోపును మజ్జిగలో కలిపి వేయాలి మజ్జిగను వేడి చేయకూడదు. వేయించిన సోంపు వేస్తే పులుసు తయారై పోతుంది.
Categories