ఢిల్లీలోని ఏయిమ్స్ ఆస్పత్రికి చెందిన డాక్టర్లు నిర్వహించిన పరిశోధనలో భారతీయ మహిళల్లో డి విటమిన్ లోపం కనిపించింది. 95 శాతం మందికి డి విటమిన్ సరిపోనులేదు. మహిళలు చాలా మంది ఇంటి పనులకే పరిమితం కావటంతో వారికి అందే సూర్యరశ్మి చాలా తక్కువ. రెండోది శరీరంలో మహిళలు ధరించే దుస్తులు చీరె ,చుడీదార్ ఇవి శరీరంలో ఎక్కువ భాగం కప్పే ఉంచుతాయి. ఇది కూడా విటమిన్ -డి లోపానికి కారణం .పిల్లలకు పాలిచ్చే దశలో ,మోనోపాజ్ తర్వాత కూడా మహిళలు ఈ విటమిన్ లోపం ఎదుర్కోంటున్నారు. ఆహారంలో రిఫైన్ ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గిపోయి కూడా విటమిన్ -డి లోపం వస్తోంది. కొలెస్ట్రాల్ పదార్థాలే శరీరంలో విటమిన్-డి ఏర్పటంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. అతి తక్కువ దుస్తులతో ఎండలో కాసేపు గడపటం విటమిన్-డిని మాత్రల రూపంలో తీసుకోవటం మాత్రమే పరిష్కారం అంటున్నారు పరిశోధకులు.

Leave a comment