Categories
తరచుగా జీవిత భాగస్వామి తో గొడవలు పడేవారికి మధుమేహం, ఆర్ధరైటిస్ రావటం తప్పదని పరిశోధకులు చెపుతున్నారు . ఈ రెండు సమస్యలకు గల కారణాలు అన్వేషిస్తూ చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టం అయింది . ఆహార అలవాట్లు జీవనశైలి వ్యాయామం లేకపోవటం మొదలైన కారణాలు ఈ వ్యాదులకు మొదటి కారణం అయినప్పటికీ నిరంతరం గొడవలు,అశాంతి ,తద్వారా నిద్రలేమి మొదలైన అంశాల కారణంగా కూడా రెండు వ్యాధులు దాడి చేస్తున్నాయని రుజువైంది . జీవిత భాగస్వామి తో గొడవలు పడకుండా ప్రశాంత మైన జీవితం గడపండి అని సలహా ఇస్తున్నారు పరిశోధకులు .