లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఈ సమయం మేకప్ కు కాస్త విరామం ఇమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. నెయిల్ పాలిష్,లిప్ స్టిక్ లు కొన్నాళ్ళు మేనేయి మంటున్నారు. గోళ్ళను శుభ్రం చేసుకొని చక్కగా కట్ చేసుకొని మాయిశ్చ రైజెర్ రాసుకోవాలి. లిప్ స్టిక్ వేసుకోకుండా వైట్ పెట్రోలియం జెల్లి,ఆలివ్ నూనె బాదం నూనె పాల మీగడ పెదవులకు రాసుకోమంటున్నారు. పాలల్లో కాస్త తెనె కలిపి పెదవులకు రాస్తే పొడి బారకుండా ఉంటాయి. మేకప్ బ్రష్ లు గోరు వెచ్చని నీళ్ళలో నాననిచ్చి,శుభ్రం చేసి ఆరబెట్టుకునే సమయం ఉంది. బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్ రాకుండా వీటిని బద్రంగా స్టోర్ చేసుకోవాలి.

Leave a comment