సుధీక్షన్ ఫౌండేషన్ ద్వారా రహదారి భద్రతపైన అవగాహన కల్పిస్తారు విజయవాడకు చెందిన చిగురు పాటి విమల ఆమె ఇరవై ఏళ్ళ కొడుకు సుదీక్షన్ 2006 లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన కొడుకు పరిస్థితి ఏ పిల్లవాడికి రాకూడదని రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై యువతకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకొన్నారు విమల. అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన పేదలకు కుత్రిమ అవయవాలు అమర్చే ఏర్పాటు చేస్తారు. రెండు తెలుగు రాష్టాలకు చెందిన ఐదు వేల మందికి కుత్రిమ అవయవాలు అమర్చారు. ఈ ఫౌండేషన్ ద్వారా . ముఖ్యంగా దివ్యాంగుల కోసం నా సమయం ఖర్చు చేస్తాను అంటారు విమల.

Leave a comment