జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు ఎదురుదెబ్బలు నష్టాలు అపజయాలు మొదలైనవి చాలా సహజమని ఓటమి కూడా ఒక్కసారి గొప్ప గుణపాఠం అవుతుందని పిల్లలకు తెలియజెప్పాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పరీక్షల్లో ఆటల్లో ఓడిపోవటం పిల్లలను నిరాశకు భయాన్ని  గురిచేస్తుంది అలాంటి సమయంలో పిల్లలు పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకునే లా వాళ్లని తీర్చిదిద్దాలి అంటున్నారు. గెలుపు ముఖ్యమే, కానీ చేసిన పొరపాట్లను చక్కదిద్దుకోవడం ద్వారా మరోసారి విజయం సాధించవచ్చని పిల్లలకు తెలియజెప్పాలి. తల్లిదండ్రులే వారికి మొదటి గురువు కనుక వాళ్లను పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకునే లా తీర్చిదిద్దాలని అంటున్నారు.

Leave a comment