రమా పద్మనాభన్  పరీక్షల సీజన్ లో చాలా బిజీగా ఉంటుంది. ఎంతోమంది దివ్యాంగులకు ఆమె పరీక్షలు రాసి పెట్టే పనిలో ఉంటుంది. కోయంబత్తూర్ కు చెందిన రమా పద్మనాభన్ సైకాలజీ లో డిగ్రీ చేసింది. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసింది. 2013 లో ఒక ఆంధ్ర విద్యార్థి కి పరీక్ష రాసి పెట్టాక ఆ విద్యార్థి మొహం లో కనిపించిన కృతజ్ఞత ఆమెకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ తరువాత దివ్యాంగులకు, అందులకు ఉచితంగా పరీక్షలు రాసి పెట్టే రమా పద్మనాభన్ ఈ పనికి ఎలాంటి రుసుము తీసుకోదు. పరీక్ష కేంద్రానికి కూడా సొంత ఖర్చుతోనే వెళుతూ ఉంటుంది.

Leave a comment