మన చేతులు ఎంత పరిశుభ్రంగా ఉంటె మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. దీన్ని పిల్లలకు పసితనం నుంచే బోధించాలి. ఇంటినిండా అందుబాటులో వుండే వాటర్ ట్యాపుల వద్ద వారిని ఎప్పటికప్పుడు చేతులు కడుక్కునేలా ప్రోత్సహించాలి. ఆహారం  తినే ముందర తీసుకున్న తర్వాత చేతికి అంటుకునేలా పానీయాలు తాగినా మందులు వేసుకునే సమయంలో అనారోగ్యంగా ఉన్నవారి దగ్గరకు వెళ్లి వచ్చాక టాయిలెట్ కు వెళ్ళాం ఆటలాడుకుని వచ్చాక ప్రతి పని తర్వాత కాస్త బాదస్తంగా అనిపించినా పిల్లలకు చేతుల శుభ్రత గుర్తు చేయటం మంచిదే. ముఖ్యంగా మరీ పసిబిడ్డల దగ్గరకు వెళ్ళినప్పుడు వారిని ఎత్తుకోవాలని అనుకుంటే తప్పనిసరిగా బయటనుంచి వచ్చిన వారు కాళ్ళు చేతులు కడుక్కునే వెళ్ళాలి. ఈ పరిశుభ్రత పెద్దవాళ్ళు చిన్నవాళ్లు ఎవరైనా సరే పాటిస్తేనే వైరల్ ఇన్ఫెక్షన్ లో ఉదర కోస  రుగ్మతలకు గురికాకుండా వుంటారు .

Leave a comment