మెరిసే చర్మం కోసం మంచి డైట్ ని సూచిస్తున్నారు నిపుణులు . అయితే ఈ డైట్ లో రాత్రికి మార్పులురావు . చర్మం పైన మార్పురావాలంటే కనీసం ఆరు వారాల  వ్యవధి కావాలి. మనం తినే ఆరోగ్యాన్ని బట్టే చర్మం ఆరోగ్యాంగా కాంతులీనుతూ ఉంటుంది. బ్రొకోలి , జామ , కివి పండ్లు ఆరెంజ్ బొప్పాయి స్ట్రా బెర్రీలు చిలకడ దుంప నేరేడు కొలెజాన్ ఉత్పత్తికి సహకరిస్తాయి . ఒమేగా 3 ఒమేగా 6 ఈ రెండు అత్యవసర ఫ్యాటీ యాసిడ్లు. ఆయిలీ ఫిష్ అవిసె నూనెలు ఒమేగా 3 లభిస్తుంది. సన్ ఫ్లవర్ కార్న్ ఆయిల్ లో ఒమేగా 6 దొరుకుతుంది. ఉల్లి వెల్లుల్లి లోదొరికే సల్ఫర్ చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. లివర్ గుడ్లు పాలు ఆయిలీ ఫిష్ గింజ ధాన్యాలు విటమిన్ ఏ  కు మంచి ఆధారం కొత్త చర్మం ఎదగటానికి ఇవి సహకరిస్తాయి. డ్రై ఆప్రికాట్స్ నువ్వుల్లో ఐరన్  బాగా దొరికి స్కిన్ టోన్ మెరుగవుతుంది. చర్మం మెరిసేందుకు విటమిన్ బి 2 చీజ్  గుడ్లు లివర్ లో అధికంగా దొరుకుతాయి. ఇవన్నీ  సరైన మోతాదులో వుండేలా హెల్త్ చార్ట్ లో చూసుకోవాలి.

 

Leave a comment