చిన్న పెద్ద అని లేదు పసిపాపలకు కూడా డి-విటమిన్ లోపం వల్లనే సమస్యలు వస్తున్నాయి. న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ బటాగో పరిశోధకులు ఈ డి-విటమిన్ లోపంతో పసిపిల్లలో రికెట్స్ వంటి ఎముకల సంబంధం ఉన్న వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ అంటున్నారు. అందుకే తల్లులు విటమిన్ డి సప్లిమెంట్స్ వాడితే ఆ పాలు తాగే పిల్లలకు ఈ విటమిన్ అంది ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు .ఎముకల కణజాలం కాల్షియంను శోషించుకొనేందుకు విటమిన్ డి ఎంతో అవసరం అంటున్నారు .సాధారణంగా ఇది సూర్యరశ్మి ద్వారా మాత్రమే అందే విటమిన్ పిల్లలకు అలా ఉందే అవకాశం లేదు కనుక తల్లిపాల ద్వారానే ఈ డి విటమిన్ అందుకోని వాళ్ళు ఆరోగ్య వంతులు అవుతారంటున్నారు.

Leave a comment