మాటి మాటికీ కాళ్ళ నొప్పులు,వళ్ళు నొప్పులు ,మెడ నెప్పులతో ఇబ్బంది పెడుతూ ఉంటే అది కాల్షియం లోపమేమో గమనించండి అంటున్నారు డాక్టర్లు.శరీరం కాల్షియం పాత్ర చాలా కీలకం. ఎముకలు దంతాలు ఆరోగ్యంగా ఆస్ట్రియో పోరోసిన్ ను నియంత్రిస్తుంది. హార్మోన్ల పనితీరు ప్రభావితం చేస్తుంది. సంతానోత్పత్తికీ కండరాల్లో సాగుదలకు అన్నింటికీ కాల్షియం అవసరం .దీన్ని మందుల్లో కంటే ఆహారం రూపంలోనే తీసుకోమ్మంటున్నారు.కాలిఫ్లవర్ ,క్యాబేజీ ,ముల్లంగి ,పెసలు, సెనగలు,సోయా,బీన్స్ లోనూ కాల్షియం ఉంటుంది. పాలకూర ,గోంగూర,తోటకూర వంటి ఆకు కూరల్లో ,ఖర్జూరం వంటి డ్రైఫ్రూట్స్ నువ్వులు, అవిసెలు వంటి ధ్యాన్యాల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి రెగ్యూలర్ గా ఆహరంలో తీసుకొంటే సరిపోతుంది అంటున్నారు వైద్యులు.

Leave a comment