పాదాలు దృడంగా ఉండాలంటే చక్కని వ్యాయామాలున్నాయి. ఫూట్ స్ట్రెచ్ అంటే కుర్తీ అంచు చివరలో కట్టి వట్టి పాదాలతో కూర్చోవాలి. వాళ్ళను కిందికి నొక్కి పెడుతూ కుడి పాదాన్ని వెనక్కు లాగాలి అంటే పాదం పై భాగం నేలను తాకుతూ వుండాలి. మడమ మధ్యలో వుండాలి ఇలా రెండు పాదాల తో చేయాలి. అలాగే టూలిఫ్ట్స్ అంటే ఎడమ వైపు పెద్ద వేలిని మిగతా వెళ్ళు కదపకుండా పైకి లేపి కిందకి దింపాలి. ఇలా ఐదు సార్లు  రెండు పాదాలతో చేయాలి. గాల్ఫ్ బాల్ పైన ప్రతి పాదాన్ని ఐదు నిమిషాల పాటు రోల్ చేయాలి. దీని వల్ల కండరాళ్ళకు కదలిక వచ్చి టిష్యు లు హైడ్రేడ్ అవ్వుతాయి. ఇలాంటి ఎక్సర్ సైజులు ఎక్స్ పర్ట్స్ అద్వర్యంలో నేర్చుకుని ప్రతి రోజు చేస్తూ వుంటే శరీరాన్ని మోసే పాదాలు దృడంగా ఉంటాయి.

Leave a comment