Categories
సెర్బియాకు చెందిన మీర్జానా కికా మిలోసెవిక్ బాడీ పెయింటింగ్ ఆర్టిస్ట్. తన శరీరాన్ని కాన్వాస్ గా చేసుకొని చిత్ర విచిత్రమైన బాడీ పెయింటింగ్స్ తో అద్భుతాలు చేస్తోంది. ఆమె వేసుకొనే మేకప్ తో శరీరం ఒక మెలిపెట్టి ముడి వేసినట్లు అయిపోతుంది.ఒట్టి రింగులపైన నిలబడిన తలలా ఉంటుంది. శరీరంపై తల మాయమైపోయి తల స్థానంలో ఒక కొక్కెం కనబడుతోంది. మేకప్ ఆర్టిస్ట్ అయినా కికా దీని కోసం శిక్షణ పొందలేదు. ఆమెకో యూట్యూబ్ ఛానల్ ఉంది.దీనిలో ఫాలోయర్స్ కి లెక్కలేదు. సొంతంగా ఆమెకు కికా పేరుతో స్టూడియో కూడా ఉంది.