Categories
చాలా సార్లు కారణం లేకుండానే తలనొప్పి వస్తూ ఉంటుంది. తినే ఆహారం ,తాగే పానీయాలు కారణం కావచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. నిల్వ ఉండే ఛీజ్ ,ప్రాసెస్ చేసిన మాంసం ,టూరమైన్ ,ఫినైల్ ,ఇథైల్ మెయిన్ అనే బయోజనిక్ ఎమైన్స్ కలిగిన పదార్థాలు చాలా మందిలో తల నొప్పులకు కారణం కావచ్చు .ఆల్కహాలు ఉండే పానీయాలు ,పెర్మెంట్ చేసిన కాయగూరలు ,సరిగ్గా శుద్ధీ చేయని చేపలు ,రెడ్ వైన్ ఇలాంటివి కూడా కారణం కావచ్చు. ఆహారం వల్ల కాకపోతే కండరాల ఒత్తిడి ,డీహైడ్రేషన్ స్త్రీలలో రుతు క్రమంలో మార్పుల వల్ల కూడా రావచ్చు.ఇందుకు డాక్టర్ సలహా తీసుకొని ,తినటం వల్లనా ,ఆహారంలో మార్పా ,ఏదైనా ఎలర్జీనా అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు.