చల్లచల్లగా వర్షం పడుతోంటే బావుంటుంది కానీ ,కాలు బయటపెడితే దుస్తులు తడుస్తాయి.చేతిలో పట్టుకొనే వస్తువులు పాడవుతాయి. అందుకే ఈ సీజన్ లో అనువైన దుస్తులు,వాటర్ ఫ్రూప్ బ్యాగ్స్ ఎంచుకొంటే మేలు. వేసవిలో వాడుకొన్నట్లే కాటన్ డెనిమ్ కఫ్రీస్ ను ఈ సీజన్ లో వాడవచ్చు. ఇవి తడిస్తే ఆరటం కష్టం కనుక సింథటిక్ కఫ్రీస్ ,ఏలాజో నీ లెంగ్త్ ట్రౌజర్లు ఈ సీజన్ కు వీలుగా ఉంటాయి.అలాగే వాటర్ ఫ్రూప్ బాగ్స్ ,బ్యాగ్ ఫ్యాక్స్ తీసుకోవాలి. మొబైల్ కవర్స్ ,వాలెట్ వంటివి వాటర్ ఫ్రూప్ వి ఎంచుకొంటే వర్షానికి పాడవ్వవు. మంచి బ్రైట్ కలర్స్ ,పూవ్వుల డిజైన్స్ ఎంచుకొంటే సరిపోతుంది.

Leave a comment