కార్తీక మాసంలో భూలోకవాసులకు దర్శనం ఇవ్వడానికి పార్వతి పరమేశ్వరులు విహారయాత్రకి ఆంధ్ర ప్రదేశ్ వై.యస్.ఆర్ కడప జిల్లాలోని గోపవరం మండలం,ఓబుల్ గ్రామంలోని కొండ ప్రాంతమైన నల్లమల అడవుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని మోక్షం పొందుదాము రండి.
శ్రీ రామచంద్రమూర్తి వనవాసం పూర్తి  చేసుకొని సీతాసమేతుడై ఈ ప్రాంత వాతావరణానికి ముగ్ధుడై కొన్ని రోజులు విరామానికి ఉండిపోయారు.అప్పుడు ఈ ప్రదేశంలో శివలింగం ప్రతిష్ఠ చేశాడు.ఈ క్షేత్రంలో మూడు గుండాలు ఉన్నాయి.పసుపు నీటి గుండం,మోక్ష గుండం,తొంగి చూపుల గుండం.ఇక్కడ స్నానం చేసిన సకల రోగ నివారణ అని భక్తుల నమ్మకం.
ఈ ప్రాంతంలో కాకి, పులులు శివుని శాపం వల్ల సంచరించడం జరగదు, కనబడవు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,అభిషేకం.

            -తోలేటి వెంకట శిరీష

Leave a comment