దాదాపుగా అంతరించిపోయిన నకాశీ చిత్రాలకు మళ్ళి ఆదరణ వస్తుంది. రామాయణ,మహాభారత పురాణాల ఆధారంగా గీసి ఈ నకాశీ ఆర్ట్స్ చేర్యాలలో మళ్ళీ ఉపందుకుంది,తెలంగాణ నుంచి విధేశాలకు విస్తరిస్తుంది. ఈ ప్రాచీన కల కాకతీయుల కాలంనాటి కంటే ముందే ఉంది. ఒక్క కులానికి ఒక్కో దేవుడు అ కులాల నేపథ్యాలు వాటిని కులపురాణాలు అంటారు. ఆ పురాణాలను హవాభావాలతో చేప్పేందుకు కొన్ని చిత్రాలు రూపొందించేవారు అవి చేర్యాలలో దోరికేవి.చింతగింజలు నానబెట్టి ఉడకబెడతారు ఆ జిగురుతో శుద్దమట్టి గంజి తిరుగులి చెట్ల నుంచి తీసే గోందు కలిపి ఒక వస్త్రం పైన ముడుపొరలుగా పూస్తారు.ఇదే కాన్వాస్, విష్ణుమూర్తి,శివుడు బొమ్మలని సహజ రంగులతో వేస్తారు మధ్య వయసు ఉన్న ఉడత తోక వెంట్రుకలు బ్రష్ గా వాడతారు. మేక మెడ,తోక వద్ద ఉండే వెంట్రుకలతో పెద్ద బ్రష్ తయారు చేసుకుంటారు.ఇప్పుడు ఈ పెయింట్స్ సిద్దిపేట జిల్లా చేర్యాలలో చూడవచ్చు.
Categories