Categories
ఫ్యాషన్ ప్రపంచం నుంచి ఎందుకో కనుమరుగై పోయిన ఫొల్క్ డాట్స్, ఓ బేబీ సినిమాలో సమంత వేసుకునే సరికి మళ్ళీ మార్కెట్ లోకి వచ్చాయి. ఫొల్క్ డాట్స్ అండ్ నలుపు పైన తెల్లని చుక్కలు,లేదా అన్ని రంగుల్లోను తెల్ల చుక్కలు ఉండేవి. కానీ ఇపుడు ఏ రంగు చుక్కలైనా అన్ని రంగుల దుస్తుల పైన వస్తున్నాయి. జీన్స్ లోను చుక్కల జీన్స్ వచ్చాయి. బెనారస్ కంచి వంటివి కూడా ఫొల్క్ డాట్స్ తో సరికొత్తగా మార్కెట్ లోకి వచ్చేశాయి. వట్టి దుస్తులే కాదు ,బ్యాగులు గొడుగులు కాళ్ళ జోళ్ళు,వాచీలు చెప్పులు సర్వం ఫొల్క్ డాట్స్ మాయం ఫ్యాషన్ ప్రపంచం మొత్తం చుక్కల్లో మునిగి మెరిసిపోతుంది.