కాల్ఖేపం బఠాణీలు, వేరు సెనగలు అంటూ తీసి పారేయనక్కర లేదు. అవెం టైమ్ పాస్ టిఫిన్ లు కావు వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అద్యాయినాలు చెప్పుతున్నాయి. వేరు సెనగ కాయలను బ్రెయిన్ ఫుడ్ అని పిలుస్తారు. వేరు సేనగాల్లో వుండే విటమిన్ బి3 పోశాకమే ఇందుకు కారణం. ఈ పోషకం మెదడుకు చురుకుదనం ఇస్తుంది. జ్ఞాపక శక్తి మెరుగు పరుస్తుంది. మెదడులో స్రవించే సెరటోనిన్ అనే రాసాయినం వల్ల మూడ్స్ బావుంటాయి. వేరు సెనగ కాయల్లో వుండే ట్రిప్టో ఫాన్ అనే అమైనో యాసిడ్ మెదడులో సెరటోనిన్ విడుదలకు సహకరిస్తుంది. దాని తో మూడ్ బావుండటమే కాదు డిప్రెషన్ తగ్గిపోతుంది. అలాగే ఇందులో వుండే విటమిన్ బి కాంప్లేక్స్ లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్ లు గర్భవతులకు ఎంతో మేలు చేస్తాయి. రోజుకు గుప్పెడు వేరు సెనగ గింజలు తింటే చాలు ఎన్నో పోశాకాలి దక్కినట్లే.

Leave a comment