బంతి పువ్వు వంటి అమ్మాయి మేహానికి అందం ఇచ్చేది చక్కని జుంకీలు పొట్టిగా బుట్ట లోలాకులు, రింగులు వేలాడే జుంకీలు అందానికే అందం ఇంకా మరి అందులో కొత్త దానం కోసం వెతుకులాట సహజమే కదా. తల తిప్పగానే చమక్ మంటూ మెరిసే జుంకీల్లో వందల వేల రకాలున్నాయి. ఇప్పుడు ఆ వరసలో చేరాయి డాన్సింగ్ డాల్స్ జ్యూవెలరీ సెట్. బాలెట్ నెక్ లెస్ లు, ఇయర్ రింగ్స్ ఇమేజస్ చుస్తే చాలు. ఇవి అమ్మాయిలకు తప్పని సరిగా నచ్చుతాయనీ తెలిసిపోతుంది. భలే డాన్స్ చేస్తున్న అమ్మాయిల్లాగా ఇయర్ రింగ్స్, నెక్లెస్ ల సెట్ లు వచ్చేసాయి. బంగారం ప్లాటీనం తో చేసిన ఈ బొమ్మలు ఎంతో బావున్నాయి. వజ్రాలు రంగుల రత్నాలతో ఈ సెట్ కొత్త ట్రెండ్ సృష్టించింది.

Leave a comment