మొహాన్ని వెలుగుతో నింపేవి కళ్ళే. పెదవులు పలకనివన్నీ కళ్ళే మాట్లాడుతాయి.అలాంటి కళ్ళ చుట్టూ వలుయాలు వచ్చి కలాహీనంగా అయితే  ఏం చేయాలి? కళ్ళ అలసట పోగొట్టాలి. కీరా, బంగాళా దుంప ముక్కల్ని చక్రాల్లా కోసి కళ్ళపై పెట్టుకుని కొంత సేపు విశ్రాంతిగా వుంది చల్లని నీళ్ళతో కడిగేయాలి. ఇలా రోజుకు ఒక సారి చేస్తూ వుంటే చాలు కళ్ళ చుట్టూ వలయాలు మాయం అవుతాయి. అలాగే రోజ్ వాటర్ లో దూదిని ముంచి కాళ్ళపై పెట్టుకున్నా అలసట పోతుంది. కళ్ళు మెరిసిపోతాయి. కళ్ళ చుట్టూ వలయాలపై ఆముదం రాసి, రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే క్లీన్ చేస్తే చాలు కళ్ళ చుట్టూ ముడతలు, నలుపు, వలయాలు అన్నీ మాయం అయిపోతాయి.

Leave a comment