ఒక గ్యాంగ్ స్టర్ పాత్ర చేయబోతున్నారు కథ వినగానే చాలా నచ్చింది. దొంగల ముఠా నాయకురాలిని అన్నమాట. మోడ్రన్ దొంగలముఠా ఇది డిఫరెంట్ స్టోరీ అంటోంది విద్యాబాలన్. నాకు కథలు నచ్చాలి. ఎలాంటి కథ చెప్పిన ఎంజాయ్ చేస్తూ వింటాను. కథలోని పాత్రలో నన్ను నేను ఊహించుకొంటాను. అలా ఊహాకు వచ్చిన కథనే ఒప్పుకుంటాను. కొన్ని కథల్లో నన్ను ఊహించుకోలేను. ఇక ఆ సినిమా చేయనని చెప్పేస్తాను అంటోంది విద్యాబాలన్. గ్లామర్ పాత్రలకు నేనెప్పుడు దూరం. సినిమాల కోసం బరువు తగ్గమన్న తగ్గగలనని నేనెప్పుడు అనుకోలేదు. నా నటన ఇష్టపడాలి .ప్రేక్షకులు నన్ను ఇష్టపడతారు. ఇంకా నేనెందుకు సన్నబడాలి అంటోందామే. అందమైన చీరకట్టుతో ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించిన ఘనత విద్యాబాలన్ దే.

Leave a comment