ఎక్కడకు పోతావు చిన్నవాడ లో హీరోయిన్ గా నటించిన నందిత శ్వేత ఒక కోలీవుడ్ సినిమాలో ఏడేళ్ళ బిడ్డకు తల్లిగా నటిస్తోందట. ఆ పాత్ర గురించి చెపుతూ కథ పరంగా ఈ పాత్ర సినిమాకే హైలెట్ .గ్లామర్ పాత్ర మటుకు కాదు. ఈ పాత్రకోసం దాదాపు ఎనిమిది కిలోల బరువు తగ్గాను. రెండు నెలలు బాగా వర్కవుట్స్ చేశాను. ఏడేనిమిది సంవత్సరాల పిల్లాన్నీ ఎలా పెంచుతారో తల్లుల్ని అడిగానూ,చూశాను పాత్రని అవగాహణ చేసుకున్నా. ఈ పాత్రకోసం చాలానే శ్రమపడ్డా. చాలా చక్కగా చేశానని చెప్పవచ్చు. ఇలాంటి పాత్రలు ఎప్పుడూ రావు. వచ్చినప్పుడే ఉపయోగించు కోవాలి.ఇప్పుడు తెలుగులో శ్రీనివాస కల్యాణంలో చేస్తున్నా అని తన సినీప్రయాణం గురించి చెప్పుకొచ్చారు నందితా శ్వేత.

Leave a comment