కాలేజీకి ,లేదా ఆఫీస్ కు వెళ్ళాలంటే ప్రతి రోజు కొత్త డ్రెస్ లు కావాలంటే కుదరదు. దుస్తులు ఏవైనా హుందాగా ఉండేలా చూసుకొంటే బావుంటుంది.ఆఫీస్ లకు చీరెలు,సల్వార్లు ప్యాంటు షర్టులు ఏవైన అభిరుచిని బట్టి ఎంచుకోవచ్చు. కానీ ఏవైనా బాడీ షేప్ ని బట్టి ఎంచుకొంటే బావుంటుంది.సరైనా మ్యాచింగ్ ఉండాలి.హ్యాండ్ బ్యాగ్స్ వంటి యాక్సిసరీలు తగినట్లు ఉండాలి. ఇంకా వర్ట్ రోబ్ లో ఉండే బట్టలు చాలా సార్లు వాడిన ట్లు అనిపిస్తే ,కాస్త కొత్త దనం కావాలని కోరుకొంటే సులభంగా మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యేలా జాగ్రత్తగా చేస్తే చాలు రోజు వేసుకొనే దుస్తులు రక రకాల కాంబినేషన్ లలో కొత్తగా ఉంటాయి.

Leave a comment