Categories
వ్యాయామం ముందు వామప్ చేసినట్లు ఉదయం లేవగానే ఏదో ఒక పనిలో పడిపోకుండా ఒక నిమిషం రిలాక్స్ గా తాజా గాలిని ఆస్వాదించి ఈ రోజు చేయవల్సిన పనుల గురించి ఆలోచిస్తూ కూర్చోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉదయం నిద్రలేవగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవ్వాల కలుసుకోవల్సిన వ్యక్తులు పనులు వరుసగా పెట్టుకుని సాయంత్రం వరకు ఎంత బిజీగా గడుపుతారో లెక్కవేసుకోవచ్చు. తర్వాత మనసుకు నచ్చిన పాట వింటునో పదిని మిషాలు ఆరుబయట పచ్చికలోను అపార్ట్ మెంట్ లోనో ఉంటే సెల్లార్ లో నిలబడి సూర్యుని లేత కిరణాల వెచ్చదనాన్ని ఆస్వాదించాలి. అటు తర్వాత కప్పు కాఫీ తాగేసి పనుల్లో జొరబడిపోవచ్చు. అంతేకానీ లేవగానే మొదలయ్యే మొదటి ఐదు నిమిషాలు మాత్రం మన గురించి మనం ఆలోచించుకోవాలంటున్నారు.