ఖరీదైన సిల్క్ దుస్తులు ఇంట్లో ఉతికే క్రమంలో కొన్ని జగ్రత్తలు పాటిస్తే అవి ఎక్కువ కల మన్నుతాయి . వీటిని ఉతికేందుకు గాఢత తక్కువ ఉన్న డిటర్జెంట్ ని ఎంచుకోవాలి . మొదటి సారి ఉతికే ముందు ,చీరె అంచును నీటిలో తడిపి చూస్తే రంగు వెలిసేదా లేనిదా తెలుస్తుంది . రంగు వెలిసేలా ఉంటె దాన్ని వేరుగా ఉతకాలి . టబ్ నిండా గోరువెచ్చని నీరు నింపి,అందులో గాఢత తక్కువగా ఉండే షాంపూ ,బాడీవాష్ ,లేదా సోప్ ఏదైనాసరే వేసి దుస్తుల్ని నాననివ్వాలి . ఐదు నిముషాల తర్వాత వంపేసి ,చల్లని నీరు ,కప్పు వెనిగర్ వేసి కాస్సేపు ఉంచితే దుస్తులపై ఉన్న సబ్బుపోయి బట్టలు మెరుస్తూ ఉంటాయి . సిల్క్ దుస్తులపై మరకలు పడితే నిమ్మరసం,వెనిగర్ రాసి ఐదునిముషాలు ఆలా వదిలేసి ఉతికేస్తే మరకలు పోతాయి . వాషింగ్ మెషిన్ లో చాల తక్కువ సమయం సెట్ చేస్తే దుస్తులు పాడవకుండా ఉంటాయి .

Leave a comment