నీహారికా,
మంచి డౌటే వచ్చింది. మనల్ని మనం సంతోష పెట్టుకోవాలి. ఎప్పుడూ ఎవరి దగ్గరనుంచి ఆశించాలా అన్నావు. లేదుఎవరికి వాళ్ళు వాళ్ళకు నచ్చిన పని చేస్తే ఇది స్వయంగా ట్రీట్ ఇచ్చుకున్నట్లే చివరకు సినిమాకు వెళ్ళినా, ఫేషియల్ చేయించుకొన్న, సెలవుల్లో ఏ ట్రిప్పో వెళ్ళినా, ఏదైనా మనకోసం కొనుకున్నా ఇవన్నీ మనకు ఆహ్లాదం ఇచ్చేవే. చిన్న చిన్న సంతోషాలు పోగొట్టుకోకుండా మనకి మనం ట్రీట్ ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్ తో కాసేపు గడిపినా సరే. అంతదాకా ఎందుకు మనకు నచ్చిన పుస్తకం చదువుకోవడం మనస్సుకి ఇచ్చే బహుమతి. అసలు పుస్తకం పటనంలో వత్తిడి స్ధాయిలో 67 శాతం తగ్గుతాయి. సంగీతం వినడం ఓ కప్పుటీ తాగడం ఇవి కూడా మనల్ని మనం సంతోష పెట్టుకునేవె అంతెందుకు వీధిలో నడుస్తూ ఎదురైన వాళ్ళు మనకి పరిచయం లేకపోయినా ఓ పలకరింపు నవ్వు నవ్వినా, దానికి వాళ్ళు ప్రతిగా రెస్పాండ్ అయినా మనసు సంతోష పడుతుంది. అంటే మనం సంతోషంగా వున్నామనే సంజ్ఞ ఒక నవ్వు ద్వారా అవతలివాళ్ళకు చేరింది కదా. ముందు ఎదుటి వాళ్ళ నుంచి ఆశించే బదులు మనల్ని మనం సంతోష పెట్టుకోవడం మానలోని పాజిటివ్ యాటిట్యూడ్ కి నిదర్శనం.