నీహారికా,
కొన్ని సందర్భాలలో పర్ ఫెక్ట్ గా కనిపించాలన్నది రూల్ అనుకోవాలన్పిస్తుంది. ఇంట్లో నువ్వు క్యాజువల్ గా కనిపిస్తావనుకో, అదే స్నేహితులను కలిసేందుకు వెళితే పర్లేదు. కానీ కొత్త వాళ్ళ ముందుకు మాత్రం పద్దతిగా వెళ్ళాలని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. కొత్త వాళ్ళను కలుసుకునేందుకు మనం శ్రద్దగా తయ్యారయ్యామని అవతలి వాళ్ళకు కలగాలిట. అలాగే తెచ్చి పెట్టుకున్నట్లుగా నవ్వమంటే నవ్వామన్నట్లు ఉండకుడదు. నవ్వు హాయిగా వినిపించాలి. పెదవులు చివరి వరకు సాగదీసి చంప కండరాళ్ళు కదిలేలా నవ్వితేనే మనస్పూర్తిగా నవ్వినట్లు. ముఖ్యంగా కనుబొమ్మలు కూడా పైకి లేస్తేనే నిజంగా నవ్వినట్లు అంటున్నారు నిపుణులు. చివరిగా మనం ఎదుటివాళ్ళకు సమర్ధులుగా, ఆకర్షణీయమైన వ్యక్తులుగా నిజాయితీ పరులుగా గుర్తుండాలిలంటే ఎదుటి వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ శ్రద్దగా మాట్లాడాలట. అలా ఉంటేనే ఎదుటి వాళ్ళ మాటలు శ్రద్దగా వింటున్నట్లు, వాళ్ళపై మనం గౌరవం తో ఉన్నట్లు తెలుస్తుందిట. మరి బాడి లాంగ్వేజ్ అంటే ఇదే. మన చూపు, మాట, కూర్చునే పద్దతి, నవ్వు ఇవన్నీ మన గురించి ఎదుటి వాళ్ళకు ఫీడ్ బాక్ ఇస్తాయన్నమాట.