ఈ సృష్టి మొత్తం పంచభూతాల ఆధారంగా నిర్మితమైంది.ఈ పంచ భూతాలు కలిసి మూడు శక్తులనూ సృష్టించాయి.అవే వాత, పిత్త, కఫాలు ఇవి మన శక్తిని జీర్ణన్ని శారీరక చర్యలను శారీరక ఆకృతిని చూస్తాయి.ఈ మూడు దోషాలను ఆయుర్వేద వైద్యుల చికిత్స ల ద్వారా ఈ క్రమంలో పెట్టి మన సమస్యలను నయం చేస్తారు అంటోంది అమలాపాల్. గత నాలుగు సంవత్సరాలుగా ఆయుర్వేద విషయంలో ఎంతో ఆసక్తి చూపిస్తోంది అమలాపాల్.ఈ మధ్య నేను పంచకర్మ చికిత్స కూడా తీసుకున్నాను ఈ ఆయుర్వేద వైద్య ప్రక్రియలు నన్ను నేను అర్థం చేసుకున్నాను ఆయుర్వేదం ప్రాచీనం అనుసరణీయం ప్రకృతిలో దొరికే అపురూపమైన మూలికల సమ్మేళనం మనకి ఆరోగ్యం ఇస్తుంది అంటోంది అమలా పాల్.

Leave a comment