Categories
కరోనా సమయం కనుక చాలా మందికి ఇల్లే ఆఫీస్,జిమ్ అయింది.ఇంటి అలంకరణ తో కొన్ని మార్పులు చేసుకుంటే ఉత్సాహంగా పని చేసుకోగలుగు తారంటున్నారు ఇంటీరియర్ ఎక్సపర్ట్స్. ఆఫీస్ వర్క్ చేసుకునే డెస్క్ దగ్గరలో ఒక వెలుతురు వచ్చే లాంప్ ఏర్పాటు చేసుకోవాలి చక్కని వెలుగు పడాలి. అలాగే చిన్న చిన్న మొక్కలు ఉండే కుండీలు ఎదురుగా కనబడుతూ ఉంటే గదంతా తాజాగా కనిపిస్తుంది. చక్కని సువాసన వచ్చే ఎయిర్ ప్యూరిఫైయర్స్ గదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. లావెండర్ లేదా యూకలిప్టస్ సువాసన ఆ గది మొత్తం వచ్చేలా ఉండాలి ఈ సువాసనలు మనకు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.