Categories
Nemalika

మనస్పూర్తిగా నిజాయితీగా వుండాలి.

నీహారికా,

ఈ పదం విన్నావా, ఎమోషనల్ హానెస్టి. ఈ ఎమోషనల్ హానెస్టి ఉంటేనే మనకు మన చుట్టూ వున్న వారితో బంధువులు, స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు సజావుగా ఉంటాయి. అంటే మనం మన పట్ల, ఇతరుల పట్ల నిజాయితీగా వ్యవహరించాలన్నమాట, అందులో స్నేహంగా ప్రేమా గా వ్యావహారిస్తూ వారీ వెనక మూడో వ్యక్తి సమపక్షంలో విమర్శలు, వ్యాఖ్యానాలు చేయకూడదు. ఎదురుగా వున్నారు. కదా అని ఒక రకంగానూ వెళ్ళిపోయారు కదాని ప్రతికులంగా మాట్లాడితే  ఎమోషనల్ హానెస్టి మనలో లోపించినట్లు.  ఎమోషనల్ గా , నిజాయితీగా వున్నప్పుడు ఎవ్వరితో ఏం మాట్లాడినా ఏ పని చేసినా ఎంతో అర్ధవంతంగా వుంటుంది. హుందాతనంతో వ్యవహరిస్తే ఎదుటి వాళ్ళకు మన పైన ఎంతో సానుకూలత పెరుగుతుంది. మన పట్ల కూడా మనం అలాగే నిజాయితీగా వుండాలి. మాన నవ్వు, మాట, హామీ  మన స్వచ్చమైన మనస్సుని అద్దం లాగా ఎదుటి వాళ్ళకు చూపెడతాయి. చెరగని చిరునవ్వు ఖరీదైన నాగ వంటిదే.

Leave a comment