Categories
డాక్టర్లు హెచ్చరిస్తున్నా బాలింతల ఆహారం విషయంలో ఇళ్ళలో చాలా మూఢనమ్మకాలు నడుస్తాయి.పాశ్చత్య దేశాల్లో సాధరణంగా కాన్పు అయిన వెంటనే చక్కని భోజనం పెడతారు. కాని ఇక్కడ నార్మల్ డెలివరి అయిన వెంటనే భోజనం పెట్టరు. నిజానికి బాలింతకు బలమైన పరిశుభ్రమైన సమతుల ఆహారం మంచి నీళ్ళు ఎక్కువ అవసరం.బిడ్డకి పాలివ్వాలంటే ఆహారం,మంచి నీళ్ళు కావాలి కదా.పాలిచ్చే ముందు తల్లి రెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగాలి. కారంపొడి,వేపుడు కూరలు,వెల్లుల్లి తినిపించాలి. పెరుగు అనారోగ్యం అంటుంటారు అప్పుడు దాహం వేస్తుంది. ఆ పరిస్థితిలో డీ హైడ్రేషన్ కు గురై మూత్రం సరిగా రాదు. దీంతో యూరినరీ ఇన్ ఫెక్షన్లు జనానంగాల ఇన్ ఫెక్షన్లు వస్తాయి. అందుకే బాలింతకు మాములు అహారం,నీళ్ళు ఇచ్చి తీరాలి.