యోగ గురువు భరత్ ఠాకూర్ ని పెళ్ళాడి సినిమాలకు కొన్నేళ్ళు సెలవు పెట్టిన భూమిక చావ్లా  ఎం. సి. ఏ. తో వదిన పాత్ర  ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. హీరో వదినగా ఓక అధికారి పాత్రలో హీరో, హీరోయిన్ లతో సమానంగా ఉండే పాత్రలో నటించింది భూమిక. రీ ఎంట్రీ కోసం చాలా ఆఫర్లే వచ్చాయి. మనసుకు నచ్చినవీ మాత్రమే భూమిక చేయగలదు అనిపించిన సినిమాలే చేస్తున్నాను. గతంలో “కలెక్టర్ గారి భార్య” సినిమాలో నా పాత్ర  మహిళా సమస్యలపై పోరాడే పాత్ర. కమర్షియల్ గా హిట్ అవలేదుకానీ నాకెంతో మంచి పేరు తెచ్చింది. నటిగా నాకు మంచి కెరీర్ ఇచ్చింది టాలీవుడ్. నా కెరీర్ లో ఇక్కడ వచ్చినన్ని సకెస్స్ లు మరే భాషలో రాలేదు. అందుకే నా మొదటి ప్రయారీటీ తెలుగుకే అంటోంది భూమిక.

Leave a comment