పాకిస్థాన్ లో మొదటి ట్రాన్స్ జెండర్  లాయర్ గా  స్థానం సంపాదించింది నిషా రావు.జీవనోపాధి కోసం ట్రాఫిక్ లైట్ల దగ్గర యాచించటం తో మొదలుపెట్టి రాత్రుళ్ళు కష్టపడి చదువుకుని 2018 లో ముస్లిం లా కాలేజీ నుంచి డిగ్రీ తీసుకుంది.నమ్ముకొన్న చదువే ఆమెను యాచన నుంచి న్యాయవాదిగా మార్చింది. చదువు జాతి, మత కులానికి అతీతంగా ఎదిగేందుకు ఊతం ఇస్తుంది అని చెప్పేందుకు నిషా రావే ఉదాహరణ భవిష్యత్ లో ట్రాన్స్ జెండర్ ల కోసం ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మించాలనుకొంటోంది.

Leave a comment