సైకిక్ నవల అనడం కంటె నవల కంటే గొప్పగా ఉండే జీవితం అనవచ్చు. రచయిత పీటర్ హుర్కోస్ పొందిన అతీంద్రియ శక్తులకు సంబంధించిన నవల. నెదర్లాండ్ లో 1911 లో శ్రామిక కుటుంబంలో పుడతాడు పీటర్ హుర్కోస్. పెయింటర్ వృత్తిలో ఉంటూ ప్రమాదవశాత్తు ఎత్తైన భవనం పై నుంచి పడి మెదడు, ఎముకలు చితికిపోతాయి. స్పృహలోకి రావటంతోనే తాను కొత్తశక్తులు తెచ్చుకున్నానని తెలుసుకుంటాడు హుర్కోస్. మనిషి మొఖం చూసీ స్పర్శతోను ఇతను ఎవరో చెప్పగలుగుతాడు. విజ్ణానశాస్త్రం , వైద్య శాస్త్రం ఒప్పుకోని ఇతని జీవితం ఎన్నో టీవీ షోల్లో ప్రసారం అయింది. ఎంతో మంది ప్రసారం చేశారు . అతని జీవిత కథనే సైకీ. అపూర్వ నేత్రం కలిగిన ఇతని జీవితకథ ను చదివి తీరాలి.

Leave a comment