అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల జాబితా 2021లో చోటు దక్కించుకున్నది మంజుషా పి కులకర్ణి. ఈమె ఏషియన్‌ పసిఫిక్‌ పాలసీ అండ్‌ ప్లానింగ్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పదిహేను లక్షలమంది ఆసియన్‌  అమెరికన్స్‌, పసిఫిక్‌ ఐలాండ్‌ పౌరుల హక్కుల కోసం పోరాడుతున్నారు మంజుషా. మంజుషా ఇండియాలో పుట్టింది. తల్లిదండ్రుల వృత్తి రీత్యా అమెరికా వెళ్ళింది. గత రెండు దశాబ్దాలుగా జాతి సమనత్వం కోసం పోరాడుతుండటం తో ఆమెను టైమ్ మ్యాగజైన్ 2021 గాను వందమంది అత్యంత ప్రతిభావంతుల జాబితాలో చేర్చింది.

Leave a comment